29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ బతుకమ్మ : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో తొలిసారి 36 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఈ మేరకు జి.ఒ. నెంబరు 779 విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా పనిచేస్తున్న శశాంక్ గోయల్ ను డిల్లీలోని తెలంగాణా భవన్ కు రెసిడెన్స్ కమిషనర్ గా నియమించారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గా పనిచేస్తున్న నవీన్ మిట్టల్ ను రాష్ట్ర ఇందన వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా నియమించారు. వారుతో పాటు యన్.శ్రీదర్,  జ్యోతి బుద్ద ప్రకాష్, లోకేష్ కుమార్, గౌరవ్ ఉప్పల్, భారతి లక్పతి నాయక్, హరిచందన దాసరి, కీళ్ళు శివకుమార్ నాయుడు   సీనియర్ ఐ.ఎ.ఎస్.లను కూడా బదిలీ చేశారు.

  • నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న రాజీవ్ గాంధి హనుమంతు బదిలీ అయ్యారు. ఆయనను రిజిష్ట్రేషన్ అండ్  స్టాంప్ ల శాఖా స్పెషల్ సెక్రెటరీగా  నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా 2013 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వినయ్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఐ అండ్ క్యాడ్, ఆర్ అండ్ ఆర్ డిపార్ట్ మెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న వినయ్ కృష్ణారెడ్డి ని నిజామాబాద్ కు బదిలీ చేశారు.

More articles

Latest article