30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎంపీడీఓ సంతోష్ కుమార్

 

భీమ్ గల్, బతుకమ్మ : తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం తమ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని ఎంపీడీఓ సంతోష్ కుమార్ కోరారు. గురువారం ఐ కే పీ ఆధ్వర్యంలో మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన స్కూల్ యూనిఫాంలను ఆయన పిల్లలకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, ప్రభుత్వ అందరికి ఉచితంగా విద్యను అందిస్తుందని అన్నారు. ముఖ్యంగా మహిళలు పిల్లలను ప్రభుత్వ బడులకు పంపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో డీసీసీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ కుంట రమేష్, కాంగ్రెస్ మండల నాయకులు కోరాడి రాజు, పల్లె శేఖర్, గ్రామ నాయకులు రాజేశ్వర్ గౌడ్, ఎఱ్ఱన్న, ఐ కే పీ అధికారులు కుంట శ్రీనివాస్ పురస్తు నరేష్, పంచాయతీ సెక్రటరీ ప్రశాంత్, స్కూల్ పారెంట్స్ కమిటీ సభ్యులు మానస, హర్షిని, శిరీష, గ్రామ మహిళలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article