24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఇళ్ల పురోగతిపై ఎమ్మెల్యే పోచారం సమీక్ష

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి హైదరాబాద్ నుంచి టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు. మున్సిపల్​ అధికారులు, పట్టణ వార్డు ఇన్​ఛార్జీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్​ కాసుల బాలరాజ్​  సమీక్ష నిర్వహించగా.. సమావేశంలో అధికారులకు పోచారం ఫోన్​లో సూచనలు చేశారు.బాన్సువాడ పట్టణ కేంద్రంలో మొదటి విడతగా 260 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. వార్డు ఇన్​ఛార్జి సభ్యులు ప్రతిఒక్కరూ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఇళ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. నియోజవర్గంలోని బీర్కూర్, కిష్టాపూర్ , చించోలి, దామరంచ ఇసుక క్వారీల నుంచి ఇసుక అందుబాటులో ఉందని వివరించారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం స్లాబ్ వరకు పూర్తయితే రూ. 4 లక్షలు లబ్ధిదారుల అకౌంట్లలో జమవుతుందని ఇంటి నిర్మాణం పూర్తయితే మిగతా రూ. లక్ష చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు,నాయకులు జంగం గంగాధర్ , అంజిరెడ్డి, కృష్ణ రెడ్డి,నార్ల సురేష్, ఏజాస్,అసద్, గౌస్,మాజీ కౌన్సిలర్లు  తదితరులు పాల్గొన్నారు.

MLA Pocharam reviews progress of houses

More articles

Latest article