ఇళ్ల పురోగతిపై ఎమ్మెల్యే పోచారం సమీక్ష

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి హైదరాబాద్ నుంచి టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు. మున్సిపల్​ అధికారులు, పట్టణ వార్డు ఇన్​ఛార్జీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్​ కాసుల బాలరాజ్​  సమీక్ష నిర్వహించగా.. సమావేశంలో అధికారులకు పోచారం ఫోన్​లో సూచనలు చేశారు.బాన్సువాడ పట్టణ కేంద్రంలో మొదటి విడతగా 260 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. వార్డు ఇన్​ఛార్జి సభ్యులు ప్రతిఒక్కరూ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఇళ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు....