26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఇంటి భోజనంలా వండాలి

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం ను ఏజెన్సీ నిర్వాహకులు ఇంటి భోజనంలా వండాలని దొనకల్ కాంప్లెక్స్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వర్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని దొనకల్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించే మెనూ ప్రకారం భోజనాలు ఉండాలని అలాగే వంట చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర విషయాలను అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, రాములు, లక్ష్మణ్, సిఆర్పి పరిమళ, మధ్యాహ్న భోజన నిర్వాహకు లు తదితరులు పాల్గొన్నారు.

Cook like a home meal.

More articles

Latest article