27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇందూర్ లో గాలి.. వానా బీభత్సం

Must read

📰 Generate e-Paper Clip

  • కరెంట్ సరఫరాలో తీవ్ర అంతరాయం
  • విద్యుత్ శాఖకు రూ.18.30 లక్షల నష్టం

 

నిజామాబాద్, బతుకమ్మ: నైరుతి రుతు పవనాలు ముందుగా ప్రవేశించిన ఎఫెక్ట్ తో ఇందూర్ జిల్లాలో గాలీ వాన బీభత్సం రేపుతోంది. సోమవారం  రాత్రి కురిసిన వాన రైతులతో పాటు ప్రజలను ఆగమాగం చేసింది. జిల్లా వ్యాప్తంగా 15.8 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కాగా 522.1 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఎడపల్లి, నవీపేట్, చందూర్, ఆలూర్, డోంకేశ్వర్, ఆర్మూర్ మండలాల్లో 3 సెంటిమీటర్లకు పైగా వర్షం కురిసింది. నందిపేట్, రెంజల్, మోస్రా మండలాల్లో 2 సెంటీమీటర్ల పైచిలుకు వర్షం పడింది. నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ నార్త్, మోపాల్, ఇందల్వాయి, బోదన్, పోతంగల్, వర్ని, మాక్లూర్,రెంజల్, కోటగిరి, నిజామాబాద్ రూరల్ మండలాలో రెండు సెంటిమీటర్ల పైచిలుకు వాన పడింది.

గాలీ వానా బీభత్సం తో నిజామాబాద్ జిల్లాలో రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అకాల వర్షం దానికి గాలీ వాన బీభత్సం రేపడంతో పశు సంపధ, ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ భారీ చెట్లు నేలకూలాయి. దానితో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగింది. సోమవారం రాత్రి జిల్లాలో ప్రజలకు కాలరాత్రిని మిగిల్చింది. కురిసింది రెండు మూడు సెంటిమీటర్లయినప్పటికి గాలీ, బీభత్సం రేపింది. ఇటీవల విద్యుత్ శాఖ ప్రిమాన్ సూన్ చెకప్ లు చేసిన కరెంటు సరఫరాలో విద్యుత్ లైన్ లు ట్రిప్పయ్యాయి. దానితో 11 కేవి మొదలుకొని, ఎల్ టి లైన్లలో తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ శాఖ రాత్రినుంచి కరెంట్ పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. నిజామాబాద్ నగరంలో రాత్రి కరెంట్ లేకపోవడంతో ప్రజలు జాగారం చేయాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాలలో 12 గంటల పైచిలుకు సమయం తీసుకుంటే కాని కరెంటు సరఫరా కాని పరిస్థితి ఏర్పడింది.

Wind and rain wreak havoc in Indore

నిజామాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి 123 విద్యుత్ స్థంబాలు నేలకూలాయి. 3 ట్రాన్స్ ఫర్మర్ లు కాలిపోయాయి. 11కేవి విద్యుత్ లైన్ లతో పాటు ఎల్ టి లైన్లలో 12 కిలో మీటర్ల మేర తెగిపోయి కరెంటు సరఫరా నిలిచిపోయింది. జిల్లాలో బోదన్, ఆర్మూర్ డివిజన్ తో పాటు నిజామాబాద్ నగరంలో కరెంటు సరాఫరా లో ఇబ్బందులు తప్పలేదు. నిజామాబాద్ సిటిలో తొమ్మిది, ఆర్మూర్ లో 5, బోదన్ లో 6 టీంలు రాత్రి నుంచి ఉదయం వరకు పనిచేసి యుద్ధ ప్రాతిపాధికన కరెంటు సరఫరా పునరుద్ధరనకు పాటు పడ్డారని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ రవింధర్ తెలిపారు. జిల్లాలో విద్యుత్ శాఖలకు దాదాపుగా రూ.18.30 లక్షల నష్టం  వాటిల్లిందని తెలిపారు. వర్షంలో కరెంటు సరఫరాలో అంతరాయం కలిగితే ఫిర్యాదు చేయాలని, ఎవ్వరు కుడా విద్యుత్ తీగలను ముట్టుకోవద్దని, విద్యుత్ శాఖ అనుమతులు లేకుండా పనులు చేయవద్ధని సూచించారు.

Wind and rain wreak havoc in Indore

More articles

Latest article