బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2025 -26 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ బైపీసీ నూతన కోర్సును ప్రవేశపెట్టడం జరిగిందని ఇంటర్ విద్యాశాఖ అధికారి కృష్ణ చైతన్య తెలిపారు. బైపిసి కోర్సు బోధించేందుకు అధ్యాపకులను నియమించిన జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతిర్మయి రాదాబాయి మాట్లాడుతూ బైపిసి విద్య పట్ల ఆసక్తి కలిగిన బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు.
