28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భూ సమస్యల పరిష్కారానికి మండల వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని ఈ సదస్సులో రైతుల తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని భిక్కనూర్ ఎమ్మార్వో సునీత అన్నారు. సోమవారం మండలంలోని జంగంపల్లి రైతు వేదికలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు హాజరై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి రైతులతో మాట్లాడి వారి సందేహాలు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా రైతులు సదస్సులో సాదా బైనామ, పెండింగ్ బ్యూటీలేషన్ తదితర అన్ని రకాల సమస్యలు పరిష్కరించుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ బాలయ్య రెవెన్యూ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article