అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
బోర్గాంలో శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ
నిజామాబాద్, బతుకమ్మ : ఇంటికొక ఛత్రపతి శివాజీ తయారు కావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా శివాజీ మహరాజ్ సేవ సమితి ఆధ్వర్యంలో బోర్గాంలో ఏర్పాటు చేసిన శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శివాజీ పట్టాభిషేక్తులైన రోజు, హిందూ సామ్రాజ్య దినోత్సవం రోజున బోర్గాంలో శివాజీ విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవడం శుభపరిణామం అన్నారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతు, హిందూ ధర్మాన్ని సంరక్షిస్తూ హిందూ సమాజాన్ని చైతన్యం చేసిన హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ వీరత్వం కలిగిన యువత దేశానికి కావాలన్నారు. హిందూ సమాజం పైన జరుగుతున్నా దాడులను, హిందూ ఆడబిడ్డలను లవ్ జిహాద్ పేరిట జరుగుతున్నా అన్యాయాలను ప్రతిఘటించాలన్నారు. ఛత్రపతి శివాజీని గొప్ప వీరుడిగా తీర్చిదిద్దిన తల్లి జిజీయా భాయ్ నేటి మహిళలకు ఆదర్శం అన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ మందిరాలపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో శివాజీ మహరాజ్ సేవా సమితి ఇందూర్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు ముజే లక్ష్మణరావు, కార్యదర్శి రవి, కోశాధికారి జగన్, ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్, రాజేశ్వర్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

