28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచింది

Must read

📰 Generate e-Paper Clip

  • ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి వారిని నిండా ముంచింది
  • వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలు చెల్లించాలి
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

 

జగిత్యాల, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. శనివారం జగిత్యాలలో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందన్నారు. ఉద్యోగుల కు పెండింగ్ లో ఉన్న డీఏలు విడుదల చేస్తామని చెప్పి కేవలం ఒక్క డీఏ విదిల్చారని.. ప్రభుత్వం తీరుపై ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, బాధపడుతున్నారని అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని, పెండింగ్ డీఏలన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

More articles

Latest article