ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచింది
ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి వారిని నిండా ముంచింది వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలు చెల్లించాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. శనివారం జగిత్యాలలో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందన్నారు....