24 C
Hyderabad
Sunday, August 2, 2026

దేశం అభివృద్ధిపథంలో నడుస్తోంది

Must read

📰 Generate e-Paper Clip

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 11 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం “వికసిత్ భారత్ – అమృత కాలం” పేరిట కేంద్ర బీజేపీ ప్రభుత్వ 11 ఏళ్ల సేవా సూపరిపాలన, పేదల సంక్షేమం అంశాలపై  బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అద్యక్షతన కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల సంక్షేమం, పారదర్శక పాలన, సమగ్ర అభివృద్ధి – ఇవే మా లక్ష్యాలని తెలిపారు. ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, హర ఘర్ జల్, స్వచ్ఛ భారత్, జనధన్ యోజన వంటి పథకాలు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని అన్నారు. ప్రతిపక్షాలు ప్రస్తుతం ఆపరేషన్ సిందూరు వంటి అంశాల ద్వారా ప్రధాని మోదీ పై అభాసుపాల చేయాలనే కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.

The country is on a development path

ప్రజలు మోదీని విశ్వసిస్తున్నారని తెలిపారు. దేశ భద్రత విషయంలో బీజేపీ ప్రభుత్వ పట్టుదలని తప్పుబట్టే ప్రయత్నం విఫలమవుతుందన్నారు. కార్యకర్తలంతా ఈ కుయుక్తులపై ప్రజల్లో నిజాన్ని చెప్పాలి, అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఇది ప్రతి కార్యకర్త బాధ్యతని అన్నారు. ఈ రోజు పార్టీ కోసం కష్టపడితే, రేపు మీరు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీగా గెలిచే అవకాశముంటుందని తెలిపారు. గెలుపు మనదే కావాలంటే ప్రతి బూత్ స్థాయిలో కష్టపడాలన్నారు. ప్రతి ఓటును బీజేపీకి రప్పించాలని, ఇది పార్టీని బలోపేతం చేయడమే కాదు, దేశాన్ని బలోపేతం చేయడమూ”  అని అన్నారు. ఈ కార్యశాలలో కార్యక్రమా కన్వీనర్ పోతనకర్ లక్ష్మి నారాయణ, జిల్లా ఉపాధ్యక్షలు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, కో కన్వీనర్ రామచందర్, కలిగొట గంగాధర్, రూరల్ కన్వీనర్ పద్మ రెడ్డి, జిల్లా కార్యదర్శి గంగోనె సంతోష్, సుధాకర్ చారి, కార్పొరేటర్ మాస్టర్ శంకర్, మండల అధ్యక్షులు ఇప్పకాయల కిషోర్, ఆనంద్ రావు, జిల్లా, మండల, కోడూరు నాగరాజ్,బూత్ స్థాయి నాయకులు, యువ మోర్చా, మహిళా మోర్చా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

The country is on a development path

More articles

Latest article