దేశం అభివృద్ధిపథంలో నడుస్తోంది
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 11 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం "వికసిత్ భారత్ - అమృత కాలం" పేరిట కేంద్ర బీజేపీ ప్రభుత్వ 11 ఏళ్ల సేవా సూపరిపాలన, పేదల సంక్షేమం అంశాలపై బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అద్యక్షతన కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య...