29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఘన సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ ఏర్పాటుకు గుర్తింపు కావడంతో  మంగళవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కస్తూర్బా గాంధీ ప్రిన్సిపల్ శ్యామల, స్థానిక మండల నాయకులతో కలిసి  శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పాఠశాలలో మైదానం అపరిశుభ్రంగా ఉండడంతో విద్యార్థులకు క్రీడలు ఆడుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ విషయం ఎమ్మెల్యే పోచారం దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జడ్పిటిసి నారోజీ గంగారాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి రాము, అక్కపల్లి నాగేందర్, పార్వతి ప్రవీణ్, తోట సంగయ్య తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article