25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రిపోర్టర్‌పై దాడికి నిరసనగా బోధన్‌లో ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : బోధన్‌లోని ఎంఎస్ఆర్ బార్ అండ్ వైన్స్ సిబ్బంది రిపోర్టర్‌పై దాడిని ఖండిస్తూ సోమవారం బోధన్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మే 31 అర్ధరాత్రి, అక్రమ మద్యం విక్రయంపై సమాచారం మేరకు బార్‌ వద్ద కవరేజ్‌కు వెళ్లిన రాజ్ న్యూస్ రిపోర్టర్ సాహిద్‌పై బార్ యజమాని, సిబ్బంది దాడి చేశారు. మొబైల్ ఫోన్‌ను బలవంతంగా లాగి, శారీరకంగా దాడికి పాల్పడ్డారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విలేకరులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ వికాస్ మహాతోను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ, పాత్రికేయుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, విలేకరులపై దాడులను నిర్లక్ష్యంగా తూలకుండా గమనించాలని సూచించారు. ఈ ఘటనకు పాల్పడిన ఎమ్మెస్సార్ బార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

More articles

Latest article