27.5 C
Hyderabad
Friday, July 31, 2026

సకలజనుల త్యాగాలతోనే తెలంగాణ సకారమైంది

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ భావావ్యాప్తి,దశబ్దాల ఉద్యమబాట, పోరాటం, సకలజనుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సకారమయిందని ఇంచార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కనక దుర్గ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్బంగా జిల్లాకోర్టు ప్రాంగాణంలో ఆమె జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం న్యాయమూర్థులు,న్యాయవాదులు, న్యాయసిబ్బందిని ఉద్దేచించి మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంతోనే సరిపోలేదని, దాదాపు పన్నెండేళ్ల అభివృద్ధిని, ప్రగతిని సింహావలోకనం చేసునుని ముందడుగులు వేయాలని ఆమె పేర్కొన్నారు.ప్రజల ఆకాంక్షల మేరకు పాలన కొనసాగుతున్న మరిన్ని ప్రగతి పనులకు శ్రీకారం చుట్టుకోవలసిన అవష్యకత ఉన్నదని ఆమె తెలిపారు.తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని, జిల్లాల పెరుగుదలతో వికేంద్రికరణం విస్తరించి న్యాయార్థులకు న్యాయం మరింత చేరువ అయిందని జిల్లాజడ్జి కనక దుర్గ తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి బార్ తరపున జాతీయ జెండాను ఎగుర వేశారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జిలు గోపికృష్ణ, ఉపాధ్యాయ్, బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, ఉపాధ్యక్షుడు దిలీప్,గవర్నమెంట్ ప్లీడర్ అమిదాల సుదర్శన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article