కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు వినాయక్ నగర్ లోని అమరవీరుల పార్కు వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ 10 ఏళ్లలో అద్భుతమైన తెలంగాణ గా మార్చరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని 4 వ స్థానానికి, జీఎస్ డీపీలో 13 వ స్థానానికి దిగజార్చిందన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచి అయినా దిగజారుడు మాటలు మాట్లాడటం మానుకోవాలని హితువు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇకముందు అందరం తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, మాజీ మేయర్ నీతూ కిరణ్, బీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

