27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మున్నూరు కాపు కులస్తులు  విద్యారంగం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బీజేపీ ఎంపీ  డా. లక్ష్మణ్

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

మున్నూరు కాపు కులస్తులు కేవలం వ్యవసాయం, రాజకీయ రంగంలోనే రాణించడమే కాకుండా, విద్యారంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ పిలుపు నిచ్చారు.తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్, పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యుడు  లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మున్నూరు కాపు విద్యార్థులు చదువులో ముందుండి వివిధ గొప్ప రంగాల్లో నిలబడి దేశానికి కాకుండా మునురుకాపు కులానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. చదువుతోపాటు వివిధ అత్యున్నతమైన పురస్కారాల్లో రాణించి మున్నూరు కాపుల లక్ష్యాన్ని నెరవేర్చవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అలాగే చదువులోనే కాకుండా వివిధ క్రీడల్లో కూడా జాతీయ అంతర్జాతీయ స్థానాలను ప్రతిభను చాటి మున్నూరు కాపుల సత్తా ఏంటో సాటి చెప్పాలన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం సైతం విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతుందని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పదవ తరగతిలో హైయెస్ట్ మార్కులు 586 సాధించిన విద్యార్థికి పురస్కారాలు అందించారు. అనంతరం ఆయనను సన్మానించారు. ఇంటర్మీడియట్లో 994 సాధించిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించారు.

The Kapu castes of Munnur should pay special attention to the education sector.

మొత్తం 115 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారం అందజేశారు( ఎస్ఎస్సి 72 ఇంటర్ 40 టిజిసెట్ ఐదు) బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కుల చారి పటేల్, తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల ,విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లా తోట రాజశేఖర్,రాష్ట్ర అధ్యక్షుడు బాల శ్రీనివాస్ పటేల్, ధర్మపురి సురేందర్ జిల్లా మున్నూరు కాపు సంఘం కోశాధికారి, నరాల రత్నాకర్ పిసిసి కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి అబ్బాపూర్ రవి, గౌరవ అధ్యక్షులు బుస్సా ఆంజనేయులు, ప్రధాన సలహాదారు ఆకుల ప్రసాద్ ఉపాధ్యక్షులు రేంజర్ల నరేష్  సంఘం ప్రతినిధులు హరిచరణ్ , చిట్టి నారాయణరెడ్డి , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

The Kapu castes of Munnur should pay special attention to the education sector.

More articles

Latest article