27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోలు

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ పోలీస్ శాఖలో   మూడు నుంచి నాలుగు దశాబ్ధాలుగా పనిచేసిన సిసిఆర్ బి ఎస్ఐ చాందయ్య, డిచ్ పల్లి ఎస్ఐ ఎమ్. సత్యం,  మెండోరా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టెబుల్ సాబేర్ హుస్సేన్ మోర్తాడ్ పిఎస్ ఎఎస్ఐ పి. శ్రీనివాసులు, సర్వీసు పూర్తి చేసి  శనివారం పదవి విరమణ” పొందినారు. పదవి విరమణ” వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది.  నలుగురు అధికారులకు శాలువలతో సత్కరించి” పదవి విరమణ శుభాకాంక్షలు సర్టిఫికేటు(జ్ఞాపికలతో) ” ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పని వత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గోప్ప విషయమని ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు డిపార్టుమెంటు కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని, మీరు మీ కుటుంబ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షించారు.  ఈ వీడ్కోళ్ల సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ ( అడ్మిన్ ) బస్వారెడ్డి , ఏవో ఆసియా బేగం,  సి.సి.ఆర్.బి, సి.ఐ .సతీష్ కుమార్, డిచ్పల్లి సి.ఐ  మల్లేష్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్స్  తిరుపతి (వెల్ఫేర్) శ్రీనివాస్ (అడ్మిన్) సతీష్ (హోంగార్డ్స్) , పోలీస్ కార్యాలయం ఆఫీస్ సూపరింటెండెంటు  బషీర్ ,  వనజా రాణి ,అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా కుటుంబ సభ్యులు హజరు కావడం జరిగింది.

More articles

Latest article