- రాష్ట్ర డీజీపీ జితేందర్
కామారెడ్డి, బతుకమ్మ : తాము సురక్షితంగా ఉన్నామన్న భావన ప్రజలకు కలిగేలా పోలీసింగ్ ఉండాలని రాష్ట్ర డీజీపీ జితేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భద్రతాభావాన్ని ప్రజల్లో పెంపొందిచడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రతి కేసులో సమర్థమంతమైన, నిష్పక్షపాత దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ప్రజల అభిప్రాయాలకు విలువనిచ్చి సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సీపీ కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, విఠల్ రెడ్డి, యాకూబ్ రెడ్డి, ఎస్పీ ఇన్స్పెక్టర్, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
