23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

నూతన బస్సుకు అపూర్వ స్పందన

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మెట్ పల్లీ నుంచి నిర్మల్ కి శేట్ పల్లీ, దొనకల్, వెంచిర్యాల్,  మెండోరా గ్రామాల మీదుగా బస్సు గురువారం  మొదటిసారిగా రావడంతో శేట్ పల్లీ గ్రామంలో నాయకులు  గురిజాల నర్సారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు  బస్సును పూలతో అలంకరించి కొబ్బరి కాయలు కొట్టి పూజ చేసి ఘన స్వాగతం పలికారు. అపూర్వ స్పందన రావడంతో  అధికారులు గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. బస్సు ప్రతిరోజు 6 ట్రిప్పులు ప్రయాణిస్తుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెంచు ప్రశాంత్, ఎలిగేటి కిషన్, రాజేశ్వర్, చిన్న గంగాధర్, పోశెట్టి, రాము, నర్సయ్య, చిన్న లింబన్న తదితరులు పాల్గొన్నారు.

Unprecedented response to the new bus

More articles

Latest article