30.9 C
Hyderabad
Monday, August 3, 2026

దేశ వ్యాప్తంగా ఒకే ఎన్నిక నిర్వహించాలని మేధావులు కోరడం హర్షనీయం

Must read

📰 Generate e-Paper Clip

  • బీజేపీ జాతీయ నాయకులు అవనీకాంత్ పాండే

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశ వ్యాప్తంగా ఒకే ఎన్నిక నిర్వహించాలని మేధావులు కోరడం హర్షనీయమని బీజేపీ జాతీయ నాయకులు అవనీకాంత్ పాండే అన్నారు. నిజామాబాద్ లో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఆ “ఒకే దేశం – ఒకే ఎన్నిక” అంశంపై మేధావులతో బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన, ప్రోగ్రాం కన్వీనర్ శ్రీ పోతానకార్ లక్ష్మి నారాయణ నేత్రాత్వంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ నేత అవనీకాంత్ పాండే, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి హాజరై మాట్లాడారు. అవనీకాంత్ పాండే మాట్లాడుతూ  “ఈ దేశంలో ఎన్నికలు ఎక్కువసార్లు జరగడం వల్ల పరిపాలనలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నికల విధానంలో సమగ్ర సంస్కరణల దిశగా బీజేపీ ముందడుగు వేస్తోంది. ఒకేసారి ఎన్నికలు జరిగితే సమయం, ధనం, శక్తి – అన్నింటినీ ఆదా చేయవచ్చు.”మేధావులు మీ ఆలోచనలు ఆచరణ చేయాలనీ సంకల్పం తో ప్రతి రాష్ట్రం లో జిల్లాలో, మండలంలో సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహనా కలిపిస్తున్నాం.  ఈ సంస్కరణ దేశానికి కాదు ప్రజా సౌమ్యానికి అభివృధికి మేలు చేసే మార్గం. ఒకే సారి దేశంలో ఎన్నికలు జరుగుతే పరిపాలన సిరత్వం విధానాలు అమలులో వేగం అభివృద్ధి లో సృష్టత లభిస్తుంది. . దీనికి మద్దతూ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాతెలుపుతున్నామని’’ అన్నారు. జాతీయ పసుపు బోర్డు చేర్మెన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ  “దేశ అభివృద్ధిలో ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అదే ప్రజాస్వామ్యం మరింత బలపడాలంటే పద్ధతుల్లో మార్పు అవసరం. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ వంటి సంస్కరణలు దీర్ఘకాల ప్రయోజనాలను ఇస్తాయి. వరుసగా జరిగే ఎన్నికల వల్ల పాలనలో ఆటంకం ప్రజా దాన వ్యయం అధికారుల దుర్వింయోగం జరుగుతుంది’’ అన్నారు. జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ “భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ భావనకు బీజేపీ పూర్తిగా మద్దతు ఇస్తోంది. ఎన్నికల ఖర్చులు తగ్గించుకోవడం, పరిపాలనలో సమగ్రత తీసుకురావడం, ప్రజాప్రతినిధులపై నైతిక బాధ్యత పెంచడం వంటి లక్ష్యాలు ఈ పద్ధతిలో సాధ్యమవుతాయి. ప్రతి ఐదేళ్లకోసారి దేశం మొత్తానికి ఒకేసారి ఎన్నికలు జరిగితే, ప్రజలకు నష్టమేమీ ఉండదు కానీ ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయి. గ్రామస్థాయిలోంచి జాతీయస్థాయివరకు అన్ని స్థాయిల్లో ఒకేసారి ఎన్నికలు జరగాలన్న దీన్ని నిజం చేయడం కోసం బీజేపీ కార్యకర్తలందరూ ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించాలి. నిజామాబాద్ జిల్లాలో ఇదే అంశంపై మండల, డివిజన్ స్థాయిల్లో సమావేశాలు, ఇంటి ఇంటికి ప్రచారం, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తాం. ప్రతి పౌరుడికి ఈ భావన అర్థమయ్యేలా బీజేపీ బాధ్యతగా పని చేస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, ప్రోగ్రాం కో కన్వీనర్ కంచెట్టి గంగాధర్,జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, కొండా ఆశన్న, రనదీష్, మేధావులు, నగర పుర ప్రముఖులు కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు  .

More articles

Latest article