27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక వరం

Must read

📰 Generate e-Paper Clip

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక వరంలాంటిదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆర్యవైశ్య అఫీషియల్స్,  ప్రొఫెషనల్ అసోసియేషన్ (AVOPA)జిల్లా శాఖ ఆధ్వర్యంలో మాణిక్ భవన్ స్కూల్ లో నిర్వహించిన ప్రతిభా పురస్కారం 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు.  ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోదీ అగ్రవర్ణంలో ఉన్న పేద విద్యార్థుల ఉన్నత చదువులకు, ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడే విదంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడం గొప్ప చారిత్రాత్మక నిర్ణయం అన్నారు.

EWS reservation is a boon for upper caste poor students

అగ్రవర్ణ కులాలలో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. విద్యార్థులు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం విద్యాతోపాటు క్రీడలు, యోగ, కళా సాంస్కృతిక  కార్యక్రమాలలో కూడా రాణించాలని సూచించారు. విద్యార్థులు ఈ రోజుల్లో ఎక్కువ సెల్ ఫోన్ కు బంధీలు అవుతున్నారని దాని ధ్వరా బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు . ముఖ్యంగా తల్లి, తండ్రులు వీలైనంత వరకు పిల్లలను సెల్ ఫోన్ కు దూరంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు చిన్నప్పటినుండే మన ఆచార అలవాట్ల గురించి హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలను అలవాటు చేయాలనీ సూచించారు. అనంతరం పదోతరగతి, ఇంటర్మీడియట్, ఎంసెట్ లలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులను సన్మానించి మెడల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ధన్ పాల్ శ్రీనివాస్, ఇంగు ప్రసాద్, రవీందర్, భోజ రాజు, చిరంజీవ రాజు, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

EWS reservation is a boon for upper caste poor students

More articles

Latest article