మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాంపల్లి

0 2,665

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాంపల్లి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్రప్రసాద్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 1996 నుంచి క్రియాశీలకంగా వర్గీకరణ సాధన కోసం పనిచేసిన నాంపల్లి..

ఎమ్మార్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ గా, మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, పోలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు.

ఈ సందర్భంగా నాంపల్లి మాట్లాడుతూ.. తనకు మాదిగ ఉద్యోగుల సంఘం లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా స్థానం కల్పించిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగకు, సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. భవిష్యత్ లో మందకృష్ణ మాదిగ ఏ బాధ్యతలు అప్పగించినా వాటిని సమర్థవంతంగా నిర్వర్తించడంలో ముందుంటానని నాంపల్లి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.