- కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, బతుకమ్మ : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారును ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ, డిఆర్డిఓ ఏపీఓలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ 2025 కు సంబంధించి వివరాలను కలెక్టర్ కువిన్నవించారు. జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వరి 318,000 ఎకరాల్లో సోయా 84000 ఎకరాల్లో ప్రతి 34,000 ఎకరాల్లో కంది 21 ఎకరాల్లో మక్కా 50,000 ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా తో వాటికి సంబంధించిన విత్తనాలు అలాగే ఎరువులు పురుగుమందులు లభ్యత మరియు అవసరం అనే విషయాలపై కలెక్టర్ కి విన్నవించడం జరిగింది. విత్తనాలు అలాగే ఎరువులు సరిపడ అందుబాటులో ఉంచాలని అలాగే నకిలీ విత్తనాలు జిల్లాలో ఉండకుండా చూడాలని ,పోలీస్ శాఖ మరియు వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ టీమ్స్ ప్రతిరోజు తనిఖీలు చేసి ఈ సీజన్లో ప్రత్యేకంగా ప్రతి ఎక్కువగా సాగు చేసే బిచ్కుంద డివిజన్లో ఎక్కువ తనిఖీలు చేపట్టి సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని జిల్లాను నకిలీ విత్తనరహిత జిల్లాగా ఉంచాలని నిర్దేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి, డిఆర్డిఓ, హార్టికల్చర్ అధికారి, వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, హార్టికల్చర్ అధికారులు, ఏపీవోలు, హిందుస్థాన్ లివర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

