27.5 C
Hyderabad
Friday, July 31, 2026

తాళం వేసిన షాపులో చోరీకి యత్నం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన షాపులో చోరీకి యత్నం జరిగిన ఘటన చోటుచేసుకుందని వన్ టౌన్ ఎస్ఎచ్ఓ బి.రఘుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని చంద్రనగర్ కాలనీలోని గుజ్జ రవికృష్ణకు చెందిన ఆఫీస్ ఎన్టీఆర్ చౌరస్తాలోని శ్రీ మోక్ష రెస్టారెంట్ ఎదురుగా ఆర్కే బిల్డర్స్ షాప్ ఉంది. ఎప్పటిలాగే తన షాపును శనివారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు తాళం వేసి వెళ్లాడు. మరుసటి రోజు ఆదివారం ఉదయం 10 గంటలకు ఆఫీసుకు వచ్చి చూసేసరికి తన యొక్క ఆఫీసు ఆర్కే బిల్డర్స్ యొక్క షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండటం గమనించాడు. లోపలికి వెళ్లి పరిశీలించగా ఆఫీసులోని వస్తువులు అన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. లాకర్ రాక్స్ తాళాలు పగలగొట్టి తెరిచి ఉన్నాయి. షాప్ లో ఎటువంటి వస్తువులు కూడా దొంగిలించబడలేదు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article