- భక్తులకు అన్నదానం
భీమ్ గల్, బతుకమ్మ : పట్టణం లో కొలువై ఉన్న నరసింహ స్వామి ఆలయ 21వ వార్షికోత్సవ కార్యక్రమం గంగరపు సంఘం వారి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నరసింహస్వామి చిత్రపటాన్ని మంగళహరతూలు, డప్పులతో ఊరేగించారు. అనంతరం ఆలయంలో అర్చకులు రఘు నేత్రత్వంలో వేద పండితులచే ప్రత్యేక పూజలు,యజ్ఞం, పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తదనంతరం స్వామివారికి అభిషేకము, ప్రత్యేక హారతి , పూజలు నిర్వహించారు. సందర్బంగా సంగం తరపున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘం ఆధ్వర్యంలో కళాజాత బృందం సాంస్కృతిక కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోపెద్ద మనుషులు పీక లింబాద్రి, గంగారపు నరసయ్య, లింబన్న, సంఘం సభ్యులందరూ, తదితరులు పాల్గొన్నారు.

