27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

డెంగ్యూ నివారణ అందరి బాధ్యత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,కమ్మర్ పల్లీ: డెంగ్యూ వ్యాధి సోకిన దోమ కుట్టినప్పుడు మాత్రమే వ్యాపిస్తుందని వేరే ఏ విధంగానూ సోకదని వైద్యులు హసీనా ప్రజలకు అవగాహన కల్పించారు. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని కమ్మర్ పల్లీ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. దోమలు కుట్టకుండా ఉండేందుకు ప్రత్యేకమైన దుస్తులు ధరించడం ఇంట్లోని నీటి నిలువలు ఇతర ప్రదేశాలలో దోమలు పెరగకుండా చూసుకోవాలని తెలియజేశారు. దోమలు ఏడిస్ ఈజిప్టి, ఏడిస్ ఆల్బోపిక్టస్ అనే జాతికి చెందిన దోమలు కుట్టిన పది రోజుల తర్వాత వ్యక్తిలో అధిక జ్వరం, తలనొప్పి, కండరాల కీళ్ల నొప్పులు, దద్దుర్లు, కళ్ల వెనుక నొప్పి తదితరు లక్షణాలు కనిపిస్తాయని అటువంటి అప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సిహెచ్ఓ వెంకటరమణ, సబ్ యూనిట్ అధికారి రాజేందర్, సూపర్వైజర్ మారుతి, కంప్యూటర్ ఆపరేటర్ మురళీధర్, ల్యాబ్ అసిస్టెంట్ పాపన్న, ఫార్మసీ శరత్ ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article