27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

గంజాయి పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

  • ఇద్దరి అరెస్ట్.. 400గ్రాముల గంజాయి సీజ్

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  నిషేధిత గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ సీహెచ్.విలాస్ తెలిపారు. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నవీపేట్ లోని రైల్వే స్టేషన్, శివాజి చౌక్ వద్ద దాడి చేసి దర్యాపూర్ గ్రామానికి చెందిన పురుషోత్తం, ఖురేషీ చోటు మియా అనే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక్కొక్కరి వద్ద నుంచి 400గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతో గంజాయిని సీజ్ చేసి నిందితులను తదుపరి చర్యల నిమిత్తం నిజామాబాద్ ఎస్ఎచ్ఓకు అప్పగించినట్లు తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐ సింధు, సిబ్బంది చంద్ర మోమన్, నీలిరాజు, కిరణ్ కుమార్, నర్సయ్య చారీ, సాగర్ రావు, సలీం, భూమేశ్వర్, గోపి, కార్తిక్, దశ పాల్గొన్నారు.

More articles

Latest article