నిజామాబాద్ రీజినల్ మేనేజర్ జ్యోష్న
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ రీజినల్ మేనేజర్ జ్యోష్నతెలిపారు. ఈ పుష్కరాలు ఈనెల 15 నుంచి 26వరకు జరుగుతాయని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం డిపాజిట్ లేకుండా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. బుకింగ్ కోసం ఆర్మూర్ : 7382843133, బోధన్ : 9849500725, నిజామాబాద్ : 9959226022, బాన్స్ వాడ : 9491105706, కామారెడ్డి : 7382843747 నంబర్లను సంప్రదించాలని కోరారు.
