- నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రెడ్ క్రాస్ సొసైటీ సమాజానికి చేస్తున్న సేవలు అభినందనీయమని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు కొనియాడారు. రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సేవలందిస్తున్న తోట రాజశేఖర్ కు జాతీయ స్థాయిలో రెడ్ క్రాస్ అవార్డు వరించినందుకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ఆయనను ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. రాజశేఖర్ సేవల గుర్తించారని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా నిరంతరంగా సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. అలాగే ఈ కార్యక్రమంలో వేసవి కాలం లో తెసుకోవాల్సిన జాగ్రత్తలు పై రెడ్ క్రాస్ రూపొందించిన వడ దెబ్బ సూచనాపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ప్రజలలో అవగాహన పెంచడంలో రెడ్ క్రాస్ చేస్తున్న పాత్రను ఆయన ప్రశంసించారు. ప్రజలకు అత్యవసర సమయాల్లో రక్తం, చేస్తున్న అనేక నిరంతర సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు పాలనాధికారులు అంకిత్, కిరణ్ కుమార్ , డి.ఆర్.డి.ఓ పి.డి సాయ గౌడ్ , ఏ.సి.పి వెంకట్ రెడ్డి , ఇంచార్జి ఆర్.డి.ఓ స్రవంతి , డి.పి.ఓ శ్రీనివాస్ రావు, డి.ఎం.ఎచ్.ఓ రాజశ్రీ , టి.ఎం.జి.ఓ అధ్యక్షుడు ఎన్.సుమన్, సెక్రటేరి ఎన్.శేఖర్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు , కోశాధికారి కరిపే రవీందర్, జేఆర్సీ డా.అబ్బాపూర్ రవి, రామకృష్ణ, శ్రీనివాస్, మచ్చేందర్, హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

