25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ముగిసిన యూనిసెఫ్ బృందం క్షేత్ర పర్యటన

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ముగ్గురు సభ్యుల యూనిసెఫ్ బృందం డాక్టర్ ఖ్యాతి తివారి న్యూట్రిషన్ స్పెషలిస్టు, రేషా నికుoజు దేశాయి న్యూట్రిషన్ ఆఫీసర్, నరసింహారావు ల తో కూడిన బృందం పర్యటన జిల్లాలో గురువారం ముగిసింది. రెండు రోజుల పర్యటన లో భాగంగా మొదటి రోజు మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జరగగా రెండో రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లోని ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గల ఆరోగ్య ఉప కేంద్రాలు తిరుమన్పల్లి, గన్నారం నందు పోషకాహార లోపంతో బాధపడే సామ్, మామ్ చిల్డ్రన్స్ ను పరిశీలించారు. అక్కడ పోషకాహారం లోపంతో బాధపడే చిన్నారులకు అందించే సేవలపై యూనిసేఫ్ బృందం సంతృప్తి చెందారు. స్పెషల్ సప్లమెంటరీ ఫీడింగ్ కార్యక్రమంలో భాగంగా రెండవ దశలో నిజామాబాద్ జిల్లా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైనందున యూనిసేఫ్ బృందం జిల్లా పర్యటనకు వచ్చి క్షేత్ర పర్యటన చేసి రెండు ఆరోగ్య ఉప కేంద్రాలను, డిఎంహెచ్ఓ కార్యాలయాన్ని సందర్శించారు. వారి వెంట జిల్లా ఉపవైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ ఉండి వారికి తగు సమాచారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చే జూన్ నెలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు సామ్ మామ్ చిల్డ్రన్స్ కు అందించే స్పెషల్ సప్లమెంటరీ ఫీడింగ్ లో భాగంగా శిక్షణ కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్డెంట్ ఇందిరా, న్యూట్రిషన్ విభాగం నుండి రాంబాబు హాజరయ్యారు.

More articles

Latest article