28.2 C
Hyderabad

పెద్దమ్మతల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి మండలంలోనీ వెల్లుట్ల గ్రామంలో ముదిరాజుల కుల దైవమైన పెద్దమ్మతల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం  గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ముదిరాజుల సంఘం సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.  భూమి పూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలు, దాతలు ఆలయ నిర్మాణానికి సహకరించాలని సంఘం నేతలు కోరారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు మాజీ సర్పంచ్ గంట సాయిలు,దాసరి అంజయ్య,చీకుల రాములు,నర్వ శంకర్,బైండ్ల గోపాల్,నాట్కరి సాయిలు,కృష్ణ, గంగాధర్, శ్రీకాంత్, ఓట్లం సాయిలు పాల్గొన్నారు.

More articles

Latest article