26.6 C
Hyderabad
Monday, August 3, 2026

భూ భారతి చట్టం ప్రకారం  భూ సర్వే చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

కామారెడ్డి, బతుకమ్మ : భూ భారతి చట్టం ప్రకారం  భూ సర్వే చేసి పూర్తి వివరాలను పక్కాగా సేకరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్ అన్నారు. బుధవారం లింగంపేట్ మండలం నల్లమడుగు, పోతాయిపల్లి  గ్రామాలలో భూ భారతి సర్వే టీమ్ లు క్షేత్ర పర్యటన చేసి సర్వే  భూ వివరాలు, పాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న వాటి వివరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఏళ్ల తరబడి సాగుచేస్తున్న  భూ వివరాలను సంబంధిత రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. చట్టం ప్రకారం భూముల వివరాలు సేకరించాలని, సేకరించిన వివరాలను డెస్క్ వర్క్ చేయాలనీ సూచించారు.  అనంతరం లింగంపేట్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సందర్శించి, కొనుగోళ్ల వివరాలు, రైతుల వివరాలను   అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం ను త్వరగా తూకం వేసి రైస్ మిల్లులకు తరలించాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు, కేంద్రం నిర్వాహకులు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article