నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మద్యం సేవించి వాహనాలు నడిపిన 5 గురికి జైలు శిక్ష, 21 మందికి జరిమాన స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేటు నూర్జహాన్ విధించారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో 25మంది పట్టుబడ్డారు. వీరికి మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేటు నూర్జహాన్ మందు హాజరు పరిచారు. వీరిలో 5గురికి జైలు శిక్ష, 21మందికి జరిమానా విధించారు.
