27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 10వ తారీకు నుంచి 25 వ తారీకు వరకు  జరిగే వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ శ్రీనివాస్ సూచించారు.  మెండోరా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను  తేదీ 10-05-2025  నుండి 25-05-2025 .వరకు జరుగుతాయనీ, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని శిక్షణ శిబిరాలను ప్రారంభించిందన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు వుంటాయనీ, విద్యార్థులకు డ్రాయింగ్, డాన్స్, అంశాలలో విద్యార్థులకు శిక్షణను ఇచ్చేలా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారన్నారు. ఈ అవకాశాన్ని మండలంలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలనీ ఎంఈఓ సూచించారు.

More articles

Latest article