24 C
Hyderabad
Sunday, August 2, 2026

సహకార సంస్థలు ఆర్ధిక అభివృద్ధికి దోహదపడతాయి

Must read

📰 Generate e-Paper Clip

  • డీసీసీబీ డైరెక్టర్ కుంట రమేష్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సహకార సంస్థలు సభ్యుల ఆర్ధిక అభివృద్ధి కి దోహదపడతాయని డీసీసీబీ డైరెక్టర్ కుంట రమేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి అధ్యక్షతన సోమవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఐక్య రాజ్య సమితి 2025 వ సంవత్సరం ను అంతర్జాతీయ సహకార సంవత్సరం గా ప్రకటించినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన టోపీ లను పాలకవర్గ సభ్యులకు, అధికారులకు, సిబ్బందికి అందజేశారు. ఈ సమావేశం లో పాలకవర్గ సభ్యులు,ముఖ్య కార్యనిర్వహణాధికారి, సహకార అధికారులు, నాబార్డ్ డీడీఎం, టీజీసీఏబీ అధికారులు పాల్గొన్నారు.

Cooperatives contribute to economic development

More articles

Latest article