- డీసీసీబీ డైరెక్టర్ కుంట రమేష్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సహకార సంస్థలు సభ్యుల ఆర్ధిక అభివృద్ధి కి దోహదపడతాయని డీసీసీబీ డైరెక్టర్ కుంట రమేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి అధ్యక్షతన సోమవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఐక్య రాజ్య సమితి 2025 వ సంవత్సరం ను అంతర్జాతీయ సహకార సంవత్సరం గా ప్రకటించినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన టోపీ లను పాలకవర్గ సభ్యులకు, అధికారులకు, సిబ్బందికి అందజేశారు. ఈ సమావేశం లో పాలకవర్గ సభ్యులు,ముఖ్య కార్యనిర్వహణాధికారి, సహకార అధికారులు, నాబార్డ్ డీడీఎం, టీజీసీఏబీ అధికారులు పాల్గొన్నారు.
