29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 34 సంవత్సరాల తర్వాత పాత మిత్రులంతా ఒక్కచోట కలిశారు. ఈ ఆనంద క్షణాలకు నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్ వేదికైంది. నగరంలోని నాందేవ్వాడలోగల రావూజీ వంజరి సంఘం ఉన్నత పాఠశాలలో 1991లో పదవ తరగతి చదివిన విద్యార్థులు 1981 నుంచి తమతో పాటు చదివి చదువును మధ్యలో ఆపిన విద్యార్థులంతా 34 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ముత్యంరెడ్డి, మల్లయ్య, సరళ, మోహన్, గం గాధర్, విజయకుమార్, రవి, సత్యం, తదితరులను ఘనంగా సన్మానించారు. తాము ఈ స్థాయిలో ఉండటానికి ఆనాడు గురువులు చెప్పిన విద్యాబుద్ధులే కారణం అని పూర్వవిద్యార్థులంతా గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమ కుటుంబ సభ్యుల వివరాలను తెలుపుతూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు పరమేశ్వర్, నరేష్, దయాకర్ గౌడ్ , వినోద్, లక్ష్మినారాయణ, వెంకట్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

Alumni reunion

More articles

Latest article