పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 34 సంవత్సరాల తర్వాత పాత మిత్రులంతా ఒక్కచోట కలిశారు. ఈ ఆనంద క్షణాలకు నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్ వేదికైంది. నగరంలోని నాందేవ్వాడలోగల రావూజీ వంజరి సంఘం ఉన్నత పాఠశాలలో 1991లో పదవ తరగతి చదివిన విద్యార్థులు 1981 నుంచి తమతో పాటు చదివి చదువును మధ్యలో ఆపిన విద్యార్థులంతా 34 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ముత్యంరెడ్డి, మల్లయ్య, సరళ, మోహన్, గం...