24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రాష్ట్రస్థాయి మార్కులతో జిల్లాకు, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరత లక్ష్మీ

 

నిజామాబాద్ సీటీ, బతుకమ్మ : మన జిల్లా విద్యార్థి రాష్ట్రస్థాయి మార్కులు తెచ్చుకొని వారి తల్లిదండ్రులకే కాకుండా జిల్లాకు, రాష్ట్రానికి కూడా  కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరత లక్ష్మీ  కొనియాడారు.  జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరత లక్ష్మి ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలలో అత్యుత్తమ స్టేట్ బెస్ట్ మార్కులు 596/600 సాధించిన ఎస్ క్రితిని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంతటి కృషికి కారకులైన కేఓఎస్ యాజమాన్యాన్ని ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి మాట్లాడుతూ కేఓఎస్ లో ఉన్నఐఐటి మెడికల్ ఫౌండేషన్ ఎంతో చక్కగా ప్రణాళిక బద్ధంగా శిక్షణ ఇవ్వడం వల్ల, ఎంతటి హార్డ్ క్వశ్చన్ అయినా సులువుగా రాయగలిగానన్నారు. అందుకే ఇంతటి మార్కులు వచ్చాయని తెలిపారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎగ్జామ్స్ రాశానని, దానికి కారణం కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ కరికులం ఎంతగానో దోహదపడింది అని విద్యార్థిని క్రితి తెలిపారు. కేఓఎస్ డైరెక్టర్ సిహెచ్.రామోజీరావు మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభను గుర్తించే విధంగా విద్యా ప్రణాళికలు కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ లో ఉంటాయని, ఇవన్నీ ఐఐటి మెడికల్ ఫౌండేషన్ ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తండ్రి డాక్టర్ కృష్ణ మాట్లాడుతూ కే ఓ ఎస్ లో చేర్పించిన నాటినుండి స్కూల్ కరికులం ద్వారా  ఎప్పటికప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ ఉపాధ్యాయులు, డైరెక్టర్లు ఇచ్చినటువంటి ప్రణాళికల్ని తూచా తప్పకుండా పాటిస్తూ మా పాప ప్రిపేర్ అయ్యేదన్నారు.  మేము ఇద్దరం డాక్టర్స్ అవడం వల్ల పాపకు ఎక్కువగా టైం స్పెండ్ చేసే వాళ్ళం కాదన్నారు. అయినప్పటికీ కె ఓ ఎస్ విద్యా ప్రణాళికలు మా పాపకి ఎంతో దోహదపడ్డాయన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భాస్కర రావు, వివిధ జ్యుడిషరీ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

More articles

Latest article