32.2 C
Hyderabad

ఉచిత అంబలి పంపిణీ కేంద్రం ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ధన్ పాల్ లక్ష్మి బాయి అండ్ విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఉచిత అంబలి పంపిణి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలం సందర్బంగా ధన్ పాల్ లక్ష్మి బాయి అండ్ విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత అంబలి పంపిణి కార్యక్రమం గత పది సంవత్సరాల నుండి చేపట్టడం జరుగుతుంది.  11 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న ఈ అంబలి పంపిణీ కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాల నుండి మా ట్రస్టు ద్వారా నిర్వహించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమం వేసవి కాలం ముగిసే వరకు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఇలాగే సమాజంలో ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా సమాజ సేవలో పాలుపంచుకోవాలని ఆకాంక్షిచారు.  ఈ కార్యక్రమంలో పీఎల్ఎంఎస్ పెట్రోల్ బంక్ అధినేత దిగంబర్ పవర్, తాజా మాజీ కార్పొరేటర్ బైకన్ సుధా మధు, నగర ప్రముఖులు పున్నయ్య, సదాశివ,రామ స్వామి, బీజేపీ మండల అధ్యక్షులు తారక్ వేణు, శిలా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Free Ambali distribution center inaugurated

More articles

Latest article