బతుకమ్మ భిక్కనూరు: జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే విద్యార్థినులు 2024-25 సంవత్సరంలో సత్తాచాటారని జిల్లా కన్వీనర్ విమల గురువారం తెలిపారు. కన్వీనర్ విమల మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మహాత్మ జ్యోతిబాపూలే విద్యార్థులు 450/450 ఉత్తీర్ణత సాధించారన్నారు.జంగంపల్లి జ్యోతి బాపులే బాలికల పాఠశాలలోని విద్యార్థిని శ్రీ చైతన్య 570 నవ్య శ్రీ 568 మార్కులు సాధించగా 63 మంది విద్యార్థులు 500 పైగా మార్పులు సాధించారని స్కూలుకు మంచి పేరు తీసుకువచ్చిన విద్యార్థినిలకు బోధించిన ఉపాధ్యాయులకు కన్వీనర్ విమల అభినందించారు.
