- రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : పహల్గాం పర్యాటకులపై పై ఉగ్రవాద దాడిని ఖండించాలని తెయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పహల్గాం అమరుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ. పున్నయ్య మాట్లాడుతూ విశాల ప్రజాస్వామ్య విలువలతో లౌకిక శక్తులందరికీ నిలయమైన భారతదేశంలో మతతత్వ శక్తుల దాడిని తిప్పి కొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ వర్సిటీ రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ భారతదేశానికే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం శిరస్సు లాంటిదని ఈ ప్రాంతం ప్రపంచ పర్యాటకులకు అపురూపమైన విడిది కేంద్రమన్నారు. ఈ ప్రాంతం ఇటీవలి కాలంలో పర్యాటక రంగంలో విస్తారంగా అభివృద్ధి చెందిన ప్రాంతమన్నారు.. ఈ ప్రాంతం మీద ముస్లిం తీవ్రవాదులు కన్ను వేసి భారతదేశంతో పాటు పర్యావటక రంగాన్ని చిన్నాభిన్నం చేయడం విద్రోహ చర్య అని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ డా.మామిడాల .ప్రవీణ్ మాట్లాడుతూ మతతత్వ శక్తులు జరిపిన ఈ దాడిని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించినాయని గుర్తు చేశారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కోశాధికారి డాక్టర్ నాగరాజు అడికే మాట్లాడుతూ భారతదేశం నుండి వెళ్లే నీళ్లను ప్రకృతి వనరులను కట్టడి చేసినట్లయితే పాకిస్తాన్ ఎడారిగా మారుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ బ్యాంకు మేనేజర్ శివ నారాయణ సింగ్ మాట్లాడుతూ భారతదేశ రక్షణ రంగం బలమైనదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రక్షణ రంగం ఉన్మాదులకు దీటుగా సమాధానం తెలియజేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయి గౌడ్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ప్రెసిడెంట్ సురేష్ తో పాటు డాక్టర్ శిరీష బోయపాటి, డాక్టర్ వాసం చంద్రశేఖర్, డాక్టర్ పాత నాగరాజు, డాక్టర్ బాలకిషన్, డాక్టర్ మహేందర్ రెడ్డి , డాక్టర్ గుల్ హీ రానా, డాక్టర్ స్రవంతి డాక్టర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
