పర్యాటకులపై ఉగ్రవాద దాడిని ఖండించండి
రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : పహల్గాం పర్యాటకులపై పై ఉగ్రవాద దాడిని ఖండించాలని తెయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పహల్గాం అమరుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ. పున్నయ్య మాట్లాడుతూ విశాల ప్రజాస్వామ్య విలువలతో లౌకిక శక్తులందరికీ నిలయమైన భారతదేశంలో మతతత్వ శక్తుల దాడిని తిప్పి కొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ వర్సిటీ రిజిస్టర్ ఆచార్య ఎం...