27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సిద్దుల గుట్టపై చిరుత పులి

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ నవనాథ సిద్దుల గుట్టపై సోమవారం సాయంత్రం దర్శనానికి వెళ్తున్న భక్తులు చిరుత పులిని చూసి భయాందోళనకు గురయ్యారు. భక్తులు తీసిన చిరుత పులి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి సంబంధిత వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భక్తులు అప్పమత్తంగా ఉండాలని, భక్తులు సిద్ధుల గుట్టపైకి వెళ్లకుండా గేటు మూసివేసి పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామని ఆర్మూర్ ఎస్ఎచ్ఓ సత్యనారాయణ తెలిపారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చామని వలవేసి చిరుత పులిని పట్టుకుంటామని తెలిపారు. సమాచారం ఇచ్చే వరకు ఇటువైపు ఎవరూ రావొద్దని కోరారు.

More articles

Latest article