27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆర్మూర్ నుంచి భారీ వాహన ర్యాలీ

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ: భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో ఆ పార్టీ శ్రేణులు భారీ వాహనర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు కార్లలో ముందుగా ఆర్మూర్ పట్టణానికి చేరుకున్నారు.

పట్టణంలో సుమారు 400కు పైగా వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న వారంతా ఆర్మూర్ ప్రజల పంతం కాంగ్రెస్ , బీజేపీల అంతం అంటూ నినాదాలతో హోరెత్తించారు. ముందు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారు వెళ్లగా వెనకాలే మిగతా కార్లు వరంగల్ కు బయల్దేరాయి.

Huge vehicle rally from Armur

More articles

Latest article