28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరీరామ్‌  నివాసంలో ఏసీబీ సోదాలు

Must read

📰 Generate e-Paper Clip

ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా అధికారుల పాత్రపై ఏసీబీ నజర్

హైదరాబాద్, బతుకమ్మ :  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌‌లో అనేక లోటుపాట్లు ఉన్నాయని ఎన్డీఎస్ఏ రిపోర్టులో పేర్కొంది. అనంతరం తెలంగాణలో నాటకీయ పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరీరామ్‌కు చెందిన హైదరాబాద్‌లోని నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎన్టీఎస్‌ఏ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. తెలంగాణలో ఏక కాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాళేశ్వరం డిజైన్‌లో హరీరామ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హారీరామ్ విచారణకు హాజరయ్యారు. కాగా.. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని ఎన్టీఎస్ఏ రిపోర్టులో వెల్లడించింది. ఈ రిపోర్టు ఆధారంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహారించిన అధికారుల పాత్రపై ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు ఖండిస్తునే ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం మీడియాలో ఈ ప్రాజెక్ట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో అవినీతి చేసిన వారిని వదలబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈక్రమంలో ఏసీబీ అధికారుల సోదాలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

More articles

Latest article