హైదరాబాద్, బతుకమ్మ : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పంచాగుట్ట పోలీసులు గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనారోగ్య కారణాలతో మాజీ ఎమ్మెల్యే షకీల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్లోని ప్రగతిభవన్ ముందు షకీల్ కుమారుడు గతంలో యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో షకీల్ తన కుమారుడిని తప్పించారు. కుమారుడి స్థానంలో మరొకరిని పోలీసుల ముందు లొంగిపోయేలా చేశారు. అప్పట్లో ఈ కేసులో షకీల్కు సహకరించిన పోలీసులపై కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి దుబాయి లో ఉన్న షకీల్ ఇటీవల తన తల్లి మృతి చెందడంతో తెలంగాణకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన్ను అరెస్టు చేయగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
