కోటగిరి, బతుకమ్మ: ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని, భారత దేశంలో ప్రజలు కుల, మతాలకు అతీతంగా జీవించడాన్ని ఓర్వలేక భారతీయల్లోని ఐక్యతను దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తోందని కోటగిరి మండల బీజేపీ అధ్యక్షుడు ఏముల నవీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం దాడిని నిరసిస్తూ కోటగిరి మండల కేంద్రంలో హిందూ ముస్లింలు కలిసి పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ.. భారతదేశం అన్ని మతాల ప్రజల ఐక్యమత్యానికి నిదర్శనంగా నిలిచే దేశమని అన్నారు.

ఉగ్రవాదులు స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు పాకిస్తాన్ అవకాశం ఇస్తూ భారతదేశంపైకి వారిని ఉసిగొల్పుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కోటగిరి ఉమ్మడి మండల నాయకులు వడ్ల శ్యామ్, పి సతీశ్, పత్తి సాయిలు, డాన్ రాజు, తోట శీను, జుబేర్, ఎంఏ హకీం, జమీర్, వాజీద్, దావులయ్య, పుల్లెల మోహన్ రావు, శ్యామల, జగదీశ్, ఆనంద్, శ్రీనివాస్, మామిడి సాయిలు, పోతయ్య తదితరులు పాల్గొన్నారు.
